మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన యువకుడు (24), తన మరదలిని (20) ప్రేమించి, వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే, యువకుడికి హెచ్ఐవి ఉన్నట్లు తెలియడంతో యువతి తండ్రి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో, యువకుడు ఆమెకు హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించి, ఆమెను తనతోనే వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నాడు. గత నెల 11న సిరంజీతో ఆమెకు బలవంతంగా రక్తాన్ని ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండు తరలించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమోన్మాది ఘటనలో హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
RELATED ARTICLES


