
ప్రపంచ దేశాలు లక్షల కోట్లు ఖర్చు చేసినా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత శాస్త్రవేత్తలు సాధించారు! తమిళనాడులోని కల్పక్కం అణు విద్యుత్ కేంద్రంలో ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) ఏప్రిల్ 6న విజయవంతంగా ‘క్రిటికాలిటీ’ సాధించింది. 🛡️⚡
ప్రపంచం విఫలమైన చోట భారత్ విజయం!
ఈ టెక్నాలజీ కోసం అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నించి, వేల కోట్లు ఖర్చు చేసి చివరకు చేతులెత్తేశాయి. ప్రస్తుతం వాణిజ్య స్థాయిలో ఈ రియాక్టర్లను నడుపుతున్న ఏకైక దేశం రష్యా. ఇప్పుడు ఆ సరసన భారత్ చేరి అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చింది!
అసలు ఏంటి ఈ ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ స్పెషాలిటీ?
అద్భుతమైన టెక్నాలజీ: ఇది తను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది! (Magic, isn’t it? ✨)
థోరియం పవర్: మన దేశంలో పుష్కలంగా ఉన్న థోరియం నిల్వలను ఉపయోగించుకుని విద్యుత్ తయారు చేసే రెండో దశలోకి భారత్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
స్వయం సమృద్ధి: విదేశీ యురేనియం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఇక తగ్గుతుంది.
💎 1950ల్లోనే కనుగొన్న మూడు అంచెల అణు వ్యూహం నేడు వాస్తవరూపం దాల్చుతోంది.
ఈ ఒక్క రియాక్టర్ ద్వారా దాదాపు 30 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా, కాలుష్యం లేని విద్యుత్ అందుతుంది.
వచ్చే 300-400 ఏళ్ల వరకు భారత్ ఇంధన అవసరాలకు డోకా ఉండదు!
ఎందుకు మిగతా దేశాలు ఫెయిల్ అయ్యాయి?
ఈ రియాక్టర్లలో నీటికి బదులు ద్రవ సోడియంను కూలెంట్‌గా వాడతారు. ఇది గాలితో కలిసినా మండుతుంది. దీన్ని నియంత్రించడం అత్యంత కష్టమైన పని. అందుకే అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రమాదాల వల్ల వెనక్కి తగ్గాయి. కానీ మన భారతీయ ఇంజనీర్లు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు!


