మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామం ఉమ్మడి కుటుంబానికి చెందిన కాసం లచ్చన్న,భాస్కర్,రామన్న ఇల్లు రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యాయి.సుమారు 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.విలువైన ధాన్యం బస్తాలు,ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ సామగ్రి మంటల్లో కాలి బుడిదయ్యాయన్నారు.ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు వాపోయారు.సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన ఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా చేశారు.నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామన్నారు.బాధిత కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ సుమలత ప్రేమ్ సాగర్, ఉప సర్పంచ్ హరీష్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్,రాజన్న,తదితరులు పరామర్శించారు..
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
RELATED ARTICLES


