వేసవిలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చిన కొత్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జలీల్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పదిమందికి సాయం చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ బాటలో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా స్వంత ఖర్చుతో చల్లని మినరల్ వాటర్ ను అందిస్తున్న జలీల్ పై ప్రయాణికులు,పాదచారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.రోజుకు 500 రూ. వాటర్ టిన్ లతో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.భీమారం నుంచి నెన్నెల వయా మహారాష్ట్ర దూరాలకు ప్రయాణించే వారు సైతం ఈ చలివేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు.ఒకవైపు ప్రజల నీటి దప్పికను తీర్చడమే గాక ఆరోగ్యం పట్ల సైతం శ్రద్ద వహిస్తున్న జలీల్ సేవ ఆదర్శప్రాయం నిలుస్తోంది..
ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు
RELATED ARTICLES


