Homeమంచిర్యాల జిల్లా వార్తలుమంచిర్యాల : ఇంటర్ ఫలితాలలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన మందమర్రి బిడ్డ గంగిపెల్లి...

మంచిర్యాల : ఇంటర్ ఫలితాలలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన మందమర్రి బిడ్డ గంగిపెల్లి సిరి

మంచిర్యాల : కృషి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది మందమర్రి బిడ్డ గంగిపెల్లి సిరి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈమె అసాధారణ ప్రతిభను కనబరచి, మందమర్రి పట్టణ ఖ్యాతిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లింది.​మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శాంతినగర్‌కు చెందిన రాజేశం–పద్మ దంపతుల కుమార్తె సిరి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. మొత్తం 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి, ‘ఏ ‘ గ్రేడ్‌తో ఉత్తీర్ణత పొందింది.కేవలం రెండు మార్కులు మాత్రమే కోల్పోయి, రాష్ట్ర స్థాయి టాపర్ల సరసన నిలిచింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్న సిరి, చిన్ననాటి నుంచే చదువులో ముందుండేది. నిరంతర శ్రమ, క్రమశిక్షణే తన విజయ రహస్యమని ఆమె నిరూపించింది. ఈ సందర్భంగా స్థానికులు, విద్యావేత్తలు సిరిని అభినందిస్తూ.. ఆమె విజయం మరెంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.​పట్టుదలతో చదివితే లక్ష్యాలు తప్పకుండా సాధ్యమవుతాయని సిరి నిరూపించిందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular