మంచిర్యాలలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్ మరియు సీఐలతో కలిసి వివరాలు వెల్లడించారు.నిందితుడి వివరాలు:A1) ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల,తండ్రి: శ్రీనివాస్ రెడ్డిమల్ల, వయస్సు:26 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మహార్),వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, నివాసం: డాల్ఫిన్ టైలర్ సమీపం, రయ్యత్వరి కాలనీ, బైపాస్ రోడ్, చంద్రపూర్ (స్వగ్రామం: పెద్దపల్లి).A2) రెడ్డిమల్ల ఆకాష్, తండ్రి: శ్రీనివాస్ రెడ్డిమల్ల, వయస్సు: 28 సం., కులం: SC- మహార్, వృత్తి: మైనింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, నివాసం: near డాల్ఫిన్ టైలర్, రయ్యత్వరి కాలరీ, బైపాస్ రోడ్, చంద్రపూర్ స్వగ్రామం పెద్దపెల్లిస్వాధీనం చేసిన వస్తువులు:మొత్తం 311 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.బంగారు మువ్వల హారం (సుమారు 50 గ్రాములు) మరియు మూడు ఉంగరాలు (17 గ్రాములు) కలిపి 67 గ్రాముల బంగారాన్ని చంద్రపూర్‌లోని ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో తనఖా పెట్టి రూ.6,76,000/- పొందారు.అదనంగా దొంగిలించిన నగదు రూ.1,50,000/-తో పాటు మొత్తం మొత్తాన్ని జల్సాలు మరియు బెట్టింగ్‌లకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.బంగారు ఆభరణాలు:మూడు నల్లపూసల హారాలు (96 గ్రా), రెండు నెక్లెస్‌లు (66 గ్రా), 20 ఉంగరాలు (23 గ్రా), ఒక జత చెవికమ్మలు (9 గ్రా), ఒక జత మట్టెలు (3 గ్రా), రెండు చైన్లు (24 గ్రా), ఒత్తులు (6 గ్రా), బంగారం బిస్కెట్ (48 గ్రా), ఒక బ్రేస్లెట్ (36 గ్రా) – మొత్తం 311 గ్రాములు.వెండి వస్తువులు:హారతి,ప్లేట్,రెండు మాణిక్యాలు, నూనెపావు, పంచపాత్రలు,గిన్నె, శంఖం, కుంకుమభరణి,గ్లాసు, పూజ గిన్నె తదితరాలు –మొత్తం సుమారు ఒక కిలో.కేసు వివరాలు:పిర్యాదుదారుడు ముదం నాగయ్య (64), సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి,గౌతమేశ్వర కాలనీ, మంచిర్యాలలో నివసిస్తున్నాడు.22.04.2026 రాత్రి తన స్వగ్రామానికి వెళ్లి, 23.04.2026 సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా లాకర్లు తెరచి బంగారం,వెండి వస్తువులు మరియు నగదు దొంగిలించబడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన అనంతరం,డీసీపీ మరియు ఏసీపీ మార్గదర్శకత్వంలో, ఇన్స్పెక్టర్ ప్రమోద్‌రావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి,సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీమ్,సీసీఎస్ టీమ్ సహాయంతో సాంకేతిక విధానాలు ఉపయోగించి మంచిర్యాల బస్‌స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితులపై చంద్రపూర్,నాగపూర్ ప్రాంతాల్లో 12కు పైగా కేసులు ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో పోలీసులు త్వరగా పట్టుకుంటారని భావించి, తెలంగాణాలో దొంగతనాలు చేయడం ద్వారా తప్పించుకోవచ్చని భావించి ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడైంది.నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు.*ప్రజలకు విజ్ఞప్తి:*వేసవి సెలవుల్లో స్వగ్రామాలకు లేదా పర్యటనలకు వెళ్లే సమయంలో విలువైన ఆభరణాలు,నగదు ఇంట్లో వదిలిపెట్టకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని మంచిర్యాల పోలీసులు సూచించారు.
భారీ చోరీ కేసును చేదించిన మంచిర్యాల పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
RELATED ARTICLES


