నిర్మల్: కాండ్లి శివారులో అస్థిపంజరం లభ్యంలోకేశ్వరం మండలంలోని రాయాపూర్ కాండ్లి శివారులో గుర్తు తెలియని పురుషుని అస్థిపంజరం లభ్యమైంది. పిప్రి ఎత్తిపోతల పనులు చేపడుతుండగా ట్యాంక్ నంబర్ 20లో కాల్చివేసిన ఆనవాళ్లతో కూడిన అస్థిపంజరం బయటపడింది. ఇది దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన సంఘటనగా భావిస్తున్నారు. ఈ ఘటనపై రాయపూర్ కాండ్లి పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మరణానికి కారణాలు తెలియరాలేదని, ఎవరైనా తప్పిపోయినవారు ఉంటే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
నిర్మల్: కాండ్లి శివారులో అస్థిపంజరం లభ్యం
RELATED ARTICLES


