నెన్నెల మండల నూతన ఎస్సైగా రామ కృష్ణ ఆదివారం పోలీస్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన ప్రసాద్ బదిలీ పై తాండూరు పోలీస్టేషన్ కు వెళ్లారు. సిర్పూర్ యూ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ ను నెన్నెల ఎస్సైగా నియమించారు.మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకోసం కృషి చేస్తామన్నారు.అసంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా నెన్నెల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ బాబా మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.మండల ప్రజలు సహకరించాలని కోరారు.
నెన్నెల మండల నూతన ఎస్సైగా రామ కృష్ణ
RELATED ARTICLES


