Homeమంచిర్యాల జిల్లా వార్తలుఈ విజయం కేవలం ఎన్నికల ఫలితం కాదు — ఇది అణగారిన ఆడబిడ్డల ఆత్మగౌరవ గర్జన!

ఈ విజయం కేవలం ఎన్నికల ఫలితం కాదు — ఇది అణగారిన ఆడబిడ్డల ఆత్మగౌరవ గర్జన!

అరాచకాలు, అవమానాలు, వేధింపులు, అన్యాయాలపై బెంగాల్ మహిళలు ప్రజాస్వామ్య శక్తితో రాసిన ప్రతిఘటన చరిత్ర ఇది. అధికార దుర్వినియోగాన్ని ఓటు శక్తితో మట్టికరిపించిన అసామాన్య సాహసం ఇది. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే మహోన్నత నిదర్శనం మరొకటి ఉండదు. 🚩💪▪️రేఖా పాత్ర: సందేశ్‌ఖాలీలో గూండాల అమానుష దౌర్జన్యాలకు బలైన బాధితురాలు. అదే అభ్యర్థిని 5,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించి, తన గాయాన్ని గెలుపుగా మలిచింది.▪️రత్న దేబ్‌నాథ్: ఆర్జీ కర్ ఆసుపత్రి అత్యాచారం–హత్య ఘటనలో బాధితురాలి తల్లి. న్యాయం కోసం కన్నీటి యుద్ధం చేసిన ఆమె, నిందితులను కాపాడాలని చూసిన వ్యవస్థను ప్రజల తీర్పుతో 28,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఖండించింది.▪️కలితా మాఝీ: నాలుగు ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగించే సాధారణ మహిళ. రాజకీయ వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా, 12,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి సామాన్య మహిళల సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.ఇది కేవలం ముగ్గురు మహిళల గెలుపు కాదు… ఇది ప్రతి అణగారిన స్త్రీ స్వాభిమానానికి లభించిన ప్రజా మద్దతు.భారత ప్రజాస్వామ్యం ఇంకా శ్వాసిస్తోంది… ఇంకా పోరాడుతోంది… ఇంకా గెలుస్తోంది.ఈ సత్యాన్ని అంగీకరించలేని వారు ప్రజల తీర్పును కాదు, తమ రాజకీయ పరాజయాన్నే చూసి విలవిలలాడుతున్న చాటుకారులు ( భజన పరులు) మాత్రమే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular