మందమర్రి ఐటీఐ కళాశాలలో బాలల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సుమందమర్రి, ఏప్రిల్ 27:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐటీఐ కళాశాలలో సోమవారం “బాలల భద్రత – మాదకద్రవ్యాలకు నో చెప్పండి” (Child Safety & Say No to Drugs) అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా సీఐ పర్స రమేష్ మాట్లాడుతూ, నేటి యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి కారణంగా ఎదురయ్యే ఆరోగ్య మరియు సామాజిక సమస్యలపై విద్యార్థులకు వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై చట్టపరమైన చర్యల గురించి అవగాహన కల్పించారు.బాలల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వేధింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపద సమయంలో డయల్-100 లేదా స్థానిక పోలీసుల సహాయం ఎలా పొందాలో కూడా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై నరేష్, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి : మందమర్రి సీఐ పర్స రమేష్
RELATED ARTICLES


