దేశంలో మొట్టమొదటి సారి, బహుశా ప్రపంచంలోనే ప్రథమంగా కస్టడీలో ఇద్దరు మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మదురై అడిషనల్ సెషన్స్ జడ్జి మరణ శిక్ష విధించారు. అందరినీ ఉరి బిగించి, ఒకరితర్వాత ఒకరిని చంపాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు . 2020 సంవత్సరంలో జూన్ 19న పి. జయరాజ్ మరియు అతడి కొడుకు బెనిక్స్ ను పోలీసులు కస్టడీలోనే చంపేశారని నిర్ధారించి ఈ శిక్ష వేసారు. టూటికురన్ జిల్లా సంతణుకులం పోలీస్ స్టేషన్ కు తండ్రి, కొడుకులను తీసుకెళ్లారు. కేవలం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని స్టేషన్ కు తీసుకెళ్లి హింసించారు. తర్వాత వారిద్దరూ చనిపోయారు. మరణ శిక్ష విధించిన వారిలో ఒక సిఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు..



