Homeమంచిర్యాల జిల్లా వార్తలుప్రియుడి ముందే భార్య గొంతు కోసిన భర్త..జడ్చర్ల నుంచి కారులో జహీరాబాద్ తీసుకొస్తుండగా ఘటన

ప్రియుడి ముందే భార్య గొంతు కోసిన భర్త..జడ్చర్ల నుంచి కారులో జహీరాబాద్ తీసుకొస్తుండగా ఘటన

Facebook పరిచయం వారి పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. ప్రియుడి మోజులో పడి.. కుటుంబాన్ని వది “లేసి వెళ్లిపోయిందా ఇల్లాలు. చివరికి భర్త చేతిలోనే హత్యకు గురైంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది సమీపంలో చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ సీఐ, ఎస్సైలు శివలింగం, వినయ్ కుమార్ -తెలిపిన ప్రకారం… ఝరాసంగం మండలం తుమ్మనపల్లి కి చెందిన సిద్ధారెడ్డి(35), కవిత (29) భార్యాభర్తలు, జహీరాబాద్ లో అద్దెకుంటూ సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత టైలర్ గా పనిచేస్తోంది. ఆమెకు తిరుపతి జిల్లా మండలం చంద్రగిరికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(32)తో పదేళ్ల కిందట ఫేస్ బుక్ లో పరిచ యమై, సాన్నిహిత్యం ఏర్పడింది. మార్చి 27న అర్ధరాత్రి ఆమె భర్త, తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమా రుడిని వదిలేసి జడ్చర్లలో ఉంటున్న పవన్ కుమార్ రెడ్డి వ ద్దకు వెళ్లిపోయింది. భార్య కనిపించడం లేదని సిద్దా రెడ్డి 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో కవిత జడ్చర్లలో ఉన్నట్లు తెలిసింది. ఆదివారం ఆమెను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్ ఖదీర్, భర్త సిద్ధారెడ్డి కారులో వెళ్లారు.

దుర్భాషలాడి, అవమానించడంతో…

కవిత, ఆమె ప్రియుడు పవన్ కుమార్ రెడ్డికి జడ్చర్లలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్లాలని సూచించారు. అందుకు నిరాకరించిన కవిత అసభ్య పద జాలంతో భర్తను దూషించింది. ఆమెపై అప్పటికే కోపంతో రగిలిపోతున్న సిద్ధారెడ్డి చాయ్ కోసమని వెళ్లి చాకు కొన్నారు. ఆమె తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్ డ్డితో కలిసి జహీరాబాద్కు బయలుదేరారు. భార్యాభర్తలు గొడవ పడొద్దని.. వారిద్దరి మధ్యలో కూర్చుంటా నని కానిస్టేబుల్ ఖదీర్ చెప్పినా కవిత ఒప్పుకోలేదు. సిద్ధారెడ్డి, పవన్రెడ్డిలతో కలిసి వెనక సీటులో కూర్చుంది. కాసేపట్లో జహీరాబాద్ చేరుకుంటామనే లోగా సిద్ధారెడ్డి జేబులోంచి చాకు తీసి కవిత గొంతు, మెడపై పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్ అప్రమత్తమై కారును సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్కు సూచించారు. కానీ అక్కడికి చేరేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular