Homeమంచిర్యాల జిల్లా వార్తలుస్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ లో దొంగతనం పాల్పడిన నిందితుని అరెస్ట్... 08 గ్రాముల బంగారు...

స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ లో దొంగతనం పాల్పడిన నిందితుని అరెస్ట్… 08 గ్రాముల బంగారు లాకెట్ స్వాధీనం

తేది :25-05-2026 రోజున రాత్రి 12804 స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి దొంగతనం కి పాల్పడ్డారు. జి ఆర్ పి ఎస్ ఐ లు మహేందర్, సుధాకర్, బి. ఎన్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, క్రాంతి (CIB -IPF) ఆర్ పి ఎఫ్ లు, సిబ్బందితో కలిసి నిందితుల గాలింపు చర్యలో భాగంగా ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని పేరు అడగగా దుర్గం ప్రేమ్ కుమార్ s /o దేవాజీ r /o సిర్పూర్ కాగజనగర్ అని తెలిపి అతనిని విచారించగా తేదీ 25-05-2026 రోజున రాత్రి స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బళ్లార్ష లో ఎక్కి నిద్రిస్తున్న బాధితురాలి బ్యాగ్ ని సిర్పూర్ కాగజనగర్ వద్ద దొంగతనం చేసి ట్రైన్ మెల్లగా వెళ్లిన సమయం లో దిగి బ్యాగ్ లో ఉన్న బంగారు లాకెట్ మరియు 1300 రూపాయలను తీసుకుని బ్యాగ్ పడ వేసి ఈరోజు బంగారు లాకెట్ ని మంచిర్యాల లో అమ్ముదాం అని భాగ్యనగర్ ట్రైన్ కి వస్తుండగా రైల్వే పోలీస్ లు పట్టుకొని అతని వద్ద నుండి 8 గ్రాముల బంగారు లాకెట్ ని స్వాధీన పర్చుకొని నిందుతుడిని కాజిపేట్ రైల్వే కోర్ట్ లో రిమాండ్ కొరకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాజిపేట్ రైల్వే ఇన్స్పెక్టర్ V.నరేష్, మంచిర్యాల S.I A . మహేందర్, బెల్లంపల్లి SI సుధాకర్ రామగుండము RPF ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇట్టి కేసులో దర్యాప్తుకు సహకరించిన రైల్వే కానిస్టేబుళ్లు ఎస్ కుమార్, k. శంకర్,టి మల్ల గౌడ్, ఆర్ పి ఎఫ్ సిబ్బంది బి స్వామి,చంద్రమౌళి (HC). B.రామకృష్ణ(ASI) లను ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular