మందమర్రి కార్యాలయం ముందు సహారా బాధితుల ధర్నా ఫిక్స్ డిపాజిట్ చేసి కాలపరిమితి దాటిన మా డబ్బులను చెల్లించాలని ఆందోళన చేసిన బాధితులు తేదీ 13-04-2026 సోమవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మార్కెట్ లో ఉన్న సహారా కార్యాలయం ముందు సహారా ఇండియా సంస్థ లో మేము ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బులను కాలపరిమితి దాటిపోయి 4-5 సంవత్సరాలు గడుస్తున్నా సహారా యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడానికి నిరసన గా బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ చేత బూని సహారా ఇండియా లో మేము ఫిక్స్ డిపాజిట్ చేసిన కాలపరిమితి దాటిపోయి మా డబ్బులను మాకు వెంటనే చెల్లించాలని నిరసన చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము కట్టిన డబ్బులను వెంటనే చెల్లించాలని లేని యెడల జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సహారా బాధితులు పేర్కొన్నారు. లక్షలాది మంది సహారా బాధితుల సమస్యల పరిష్కారం కోసం గౌరవ జిల్లా లోని ఎం ఎల్ ఏ లు , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు , అదే విధంగా పెద్దపల్లి ఎంపీ గౌరవ గడ్డం వంశీ కృష్ణ గారు సహారా బాధితుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా బాధితులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మందమర్రి సహారా ఇండియా మేనేజర్ గారికి మా డబ్బులు మాకు వెంటనే ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు మరియు సహారా ఇండియా బాధితుడు గజెల్లి వెంకటయ్య , సహారా బాధితులు సిహెచ్ సంజీవ్ , డి రాజమౌళి , రామ్ నరేష్ బాబు , సి హెచ్ సంపత్ , ఎస్ మధు , దుర్గం మల్లేశ్వరి , భేరి రమాదేవి , దూత లక్ష్మి , పాషా , అబేదా తదితరులు పాల్గొన్నారు..
మందమర్రి కార్యాలయం ముందు సహారా బాధితుల ధర్నా
RELATED ARTICLES


