బెల్లంపల్లి: ఈతకు వెళ్లి కుంటలో మునిగి విద్యార్థి మృతిబెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బ్రాంచి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల కొల్లూరి రాజేష్, తాళ్లగురిజాల గ్రామ శివారులోని కుంటలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఈత రాకపోవడంతో అతను మునిగిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించగా, ఈఏంటి దుర్గం కిష్టయ్య, పైలెట్ ఒద్దిరాజేశంలు మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



