మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన గోలేటి లహన్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేశారు. లహన్ మోడల్ స్కూల్ వెనుక కట్టెలు ఏరుకుంటుండగా, గంజాయి మత్తులో ఉన్న యువకులు ‘ఇది మా ఏరియా’ అని బెదిరించి దాడి చేసి పారిపోయారు. లహన్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



