హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఒక మహిళ తన ఇద్దరు కొడుకులను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



