సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్‌ను ఫైనాన్సర్లు చెట్టుకు కట్టేసి అవమానించారు. సుమారు గంట పాటు హింసించిన ఈ ఘటన మంగళవారం జరగగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాpరు. మహిళ అని కూడా చూడకుండా అవమానించిన ఫైనాన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.



