Homeమంచిర్యాల జిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక HMS అనుబంధం

మంచిర్యాల జిల్లా ఆటో & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక HMS అనుబంధం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఆటో అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, హెచ్ ఎం ఎస్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించబడింది.కామ్రేడ్ రియాజ్ అహ్మద్ , హెచ్ ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ *కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*ఎన్నుకున్న నాయకులు:నరెడ్ల శ్రీనివాస్ — జిల్లా అధ్యక్షులుతగరం శ్రీనివాస్ — జిల్లా జనరల్ సెక్రటరీఎండి షఫీ —జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్దుడ రాజన్న–జిల్లా ఉపాధ్యక్షులుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడడానికి ముందుకు వస్తున్నామని, ట్రేడ్ యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఆటో కార్మికులందరూ ఐక్యంగా ఉండి హెచ్ ఎం ఎస్ నాయకత్వంలో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ‌ ‌ ‌ ఈ కార్యక్రమంలో హెచ్ ఎంఎస్ ఆటో యూనియన్ నాయకులు బూడిది రమేష్ రాజ రెడ్డి రమేష్, మహేష్, తాజ్ బాబా, మహేష్, అజీముద్దీన్, పల్లపు శ్రీనివాస్, అలీ, సురేష్, క్రాంతి కుమార్, సంపత్ పాల్గొన్నారు.యూనియన్ బలోపేతానికి మరియు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కొత్త కమిటీ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular