Homeమంచిర్యాల జిల్లా వార్తలుమంచిర్యాలలో బీజేపీ అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం

మంచిర్యాలలో బీజేపీ అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం

మంచిర్యాల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. చట్ట సభల్లో మహిళలలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని రఘునాథ్ అన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలు తమ హక్కుల పై చట్ట సభల్లో గళం విప్పే అవకాశం ఉంటుందని వారిని పురుషులతో పాటు మహిళలను కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు తమ ఉనికిని కల్పోతాయనే ఉద్దేశంతో మోదీ ప్రవేశ పెడుతున్న మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఎంపీ మరియు MLA స్థానాలను డిలిమిటేషన్ చేయడం తప్పనిసరని కానీ కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు ఉత్తర మరియు దక్షిణ భారతదేశం అని ప్రజల్లో లేని పోనీ అపోహలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరూ విపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పి కొట్టాలని మహిళ బిల్లు మరియు డిలిమిటేషన్ బిల్లు పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈరోజు పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular