నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల ఆదివా సీలకు దారి కష్టాలు తప్పడంలేదు… అటవీ ప్రాంతం కావడం, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో గిరిజన గ్రామాలకు అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి నెల కొంది… రోడ్డు లేని కారణంగా ఓ గర్భిణి మార్గమధ్యలోనే అటవీ ప్రాంతంలో ప్రసవించిన ఘటన… దొందారి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తొడసం సునీతకు తెల్లవారుజామున ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వైద్యంకోసం 108 అంబులెన్స్‌కు సమా చారం అందించారు. అయితే దొందారికి సరైన రోడ్డు లేక అంబులెన్స్ ఆ గ్రామానికి 10 కి.మీ. దూరంలో ఉన్న దొత్తివాగు వద్దే నిలిచిపోయింది. గర్భి ణిని ఆదివాసీలు ఎడ్లబండిలో అంబులెన్స్ ఉన్న చోటికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ నొప్పులు అధికమై మార్గ మధ్యలోనే అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సకా లంలో కాన్పు చేసే పరిస్థితి లేక ఆ గర్భిణి నరకయాతన అనుభవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించారు..
నిర్మల్ జిల్లా : తీరని దారి కష్టం.. మార్గమధ్యలోనే ప్రసవం..
RELATED ARTICLES


