ఫిబ్రవరి 2, 2026న హైదరాబాద్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వాయిద్య కారులు కీబోర్డ్ ఆగకుండా వాయించే పోటీలను నిర్వహించారు. పోటీల్లో 22 దేశాల నుండి దాదాపు 2 వేల మంది పాల్గొనగా అందులో 777మంది ఎంపికయ్యారు. అందులో ముల్కల్ల గ్రామానికి చెందిన గొడిశాల కార్తీక్ ఎంపికై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గొడిశాల రమేష్, సంధ్య దంపతుల కుమారుడు గొడిశాల కార్తీక్. సికింద్రాబాద్ లో కేఫా డి.టి.పి. వ్యాపారం నిర్వహిస్తూనే కీబోర్డ్ లో ప్రతిభ కొనసాగిస్తున్నారు. ఎంపికైన గొడిశాల కార్తీక్ కు హల్లెలు మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి హైదరాబాద్ లోని శుక్రవారం విక్టరీ ఆడిటోరియం, గచ్చిబౌలిలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్లో సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభ సందర్భముగా గొడిశాల కార్తీక్ కు మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మంచిర్యాల వాసి
RELATED ARTICLES


