మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ మంజునాథ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో సీనియర్ సిటిజన్స్ , సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ వ్యాయామ శాలలో ఈరోజు హనుమాన్ జయంతిని పూజ కార్యక్రమాలు చేసి హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ హనుమాన్ వ్యాయామ శాల నిర్వాహకుడు , సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు జెట్టి మురహరి , సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సీనియర్ వెటర్నరీ క్రీడా కారుడు పప్పు నారాయణ , సింగరేణి విశ్రాంత ఉద్యోగులు , సీనియర్ సిటిజన్స్ ఆర్ రాజన్న , ఆది రాజయ్య , మదరవేనా మల్లేష్ , గుజ్జ శంకర్ , ముత్యాల రాజమల్లు , గుజ్జ మల్లేష్ , రమేష్ ఎక్స్ S&PC ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు..



